ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నివేదిక ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నివేదిక ఇవ్వాలి

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

బాపట్ల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లాలో అధికారులు నిర్వహిస్తున్న పనులను నివేదికల ద్వారా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌కుమార్‌ పరిశీలించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వీక్ష సమావేశం మందిరం నుంచి ఓటర్ల జాబితా సవరణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో చీరాల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చివరి స్థానంలో ఉన్నదని అన్నారు. ప్రతి బీఎల్‌ఓ రోజుకు 15 మందిని మ్యాపింగ్‌ చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఎనామలిస్‌ ఎస్‌ఐఆర్‌తోపాటు ఎన్యుమరేషన్‌ కూడా చేయాలన్నారు. రేపల్లెలో ఎనామలిస్‌ పెరుగుతున్నాయని, వాటికి గల కారణాలపై ఆయన ఆర్డీఓను ఆరా తీశారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10943 చేయగా, అందులో నిజాంపట్నం 1091 ఎక్కువగా చేశారని, కారంచేడు 34 మాత్రమే చేశారని అందుకు కారణాలపై ఆయన సంబంధిత అధికారులను ఆరా తీశారు. కొన్ని మండలాలలో చాలామంది ఒక్కటి కూడా చేయలేదన్నారు. 2002లో ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన వారి దరఖాస్తుల వివరాలను అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓ లను మార్చకూడదని చెప్పినప్పటికీ బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ బీఎల్‌ఓలను మార్చారని, కారణాలపై బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ను వివరణ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు ఈ ఫైల్‌ పెట్టాలన్నారు. వేటపాలెంలోని పోలింగ్‌ స్టేషన్‌ నెం.174 బీఎల్‌ఓ సత్తెనపల్లి పద్మ ఒక్క రోజులో 318 మందిని మ్యాపింగ్‌ చేశారని, ఇది ఏ విధంగా సాధ్యమైందో వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని మండల తహసీల్దార్లు అటవీ భూమి, మడ అడవులు, జంగిల్‌ భూమి వివరాలను అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో చీరాల ఇన్‌చార్జి ఆర్డీఓ లవన్న, చీరాల తహసీల్దార్‌ గోపికృష్ణ, వీక్షణ సమావేశం ద్వారా రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వీఆర్వోలు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ను నివారిద్దాం

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్‌ నివారిద్దామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌( సిఫార్డ్‌), మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను, గుడ్డ సంచులను శుక్రవారం ఆవిష్కరించారు.

–జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement