ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం (జోన్ –3) ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 9 మంది ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షునిగా వి.బాలకృష్ణ, (మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, మంగళగిరి), గుంటూరు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా కె.జయప్రకాశ్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ఒంగోలు), ట్రెజరర్‌గా కె.కరుణాకరన్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా) ఎన్నికై నట్లు వెల్లడించారు. జిల్లా రిప్రజెంటేటివ్ పోస్టులు మొత్తం ఆరు ఏకగ్రీవం కాగా, వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జి.అమృతరాణి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, తెనాలి), పల్నాడు జిల్లాకు చెందిన సీహెచ్ మనీషా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, నరసరావుపేట), బాపట్ల జిల్లాకు చెందిన కె.రవినాయక్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, చీరాల) ప్రకాశం జిల్లాకు చెందిన బి.భాను ప్రకాష్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ప్రకాశం) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏ మల్లికార్జున్‌రెడ్డి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), మార్కాపురం జిల్లాకు చెందిన కె.ఎల్.రావు (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, మార్కాపురం) ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో జోన్ 3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నికై న జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.


