కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు

Mar 16 2026 7:37 AM | Updated on Mar 16 2026 7:37 AM

పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్‌కు మారిందని వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్‌ హౌస్‌లో ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్‌ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్‌ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సదరు ఎంపీ మహేష్‌ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement