విజయమే లక్ష్యంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యంగా పనిచేద్దాం

Mar 15 2026 5:07 AM | Updated on Mar 15 2026 5:07 AM

విజయమే లక్ష్యంగా పనిచేద్దాం ● వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం శిరోధార్యం ● పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున

నాగమోహన కృష్ణ నేతృత్వంలో

రేపల్లె: జన రంజక పాలన అందించిన జగనన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని, నాగమోహన కృష్ణ నాయకత్వంలో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా పీటా నాగమోహనకృష్ణ బాధ్యతలు చేపట్టి రేపల్లెకు తొలిసారి విచ్చేసిన సందర్భంగా ఇసుకపల్లి వేపాళ్ళమ్మ ఆలయ సమీపంలో శనివారం రాత్రి నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమంలో మేరుగ నాగార్జున మాట్లాడారు.

● రేపల్లె నియోజకవర్గంలో పార్టీ జెండా మరింత బలంగా రెపరెపలాడాలని మేరుగ పిలుపునిచ్చారు.

రానున్న 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రేపల్లె గడ్డపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేసేలా జగనన్న ఆశీస్సులతో సమన్వయకర్తగా నియమితుడైన నాగమోహన్‌కృష్ణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఒక తాటిపై పనిచేయాలని పిలుపునిచ్చారు.

● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పచ్చని పొలాలతో ప్రశాంతమైన రేపల్లె తీరప్రాంతాన్ని జూద కేంద్రంగా మార్చిన ఘనత రెవెన్యూశాఖ మంత్రి సత్యప్రసాద్‌కే దక్కుతుందన్నారు. రేపల్లె అభివృద్ధిని పక్కన పడేసి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని పేకాట, కోడిపందాల వంటి జూదాలతో కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్టవేసి ప్రజాసేవకు పరితపించే నాగమోహన్‌కృష్ణకు జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారన్నారు.

● కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ వేమూరు, అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తలు వరికూటి అశోక్‌బాబు, డాక్టర్‌ అశోక్‌కుమార్‌లు మాట్లాడారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్‌మోహన్‌, వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మండల పార్టీ కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్‌, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్‌, మహిళా కన్వీనర్‌ వీసం నాగలక్ష్మి, నాయకులు పట్టెం శ్రీనివాసరావు, అబ్దుల్‌ ఖుద్దూష్‌, చందోలు నాగలక్ష్మికుమారి, ఉమారాణి, సజ్జా పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

మాట్లాడుతున్న మేరుగ నాగార్జున, పక్కన సమన్వయకర్త నాగమోహనకృష్ణ, వేదికపై వరికూటి అశోక్‌బాబు, అశోక్‌కుమార్‌, కారుమూరు వెంకటరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement