బాపట్లటౌన్: రాజీయే రాజమార్గమని బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 4వ అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్‌బాబు అన్నారు. బాపట్ల కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కేసుల పరిష్కారానికి నాలుగు బెంచ్‌లు ఏర్పాటుచేశారు.
బాపట్ల కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 592 కేసులు పరిష్కరించారు. ఆయా కేసులకు రూ.1.82 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. పరిష్కరించిన కేసుల్లో 522 క్రిమినల్ కేసులు, 70 సివిల్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. వాణి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.పవన్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.కళ్యాణి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవిని శ్రీనివాసరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్, లోక్ అదాలత్ మెంబర్లుగా భీమా లీలాకృష్ణ, ఊట్ల రామారావు, సీహెచ్ రామాంజనేయులు, జీఎస్ నాగమోహిని పాల్గొన్నారు.


