పచ్చ మూకల విధ్వంసం
విచక్షణ రహితంగా దాడి
గాయాలపాలై జీజీహెచ్‌లో చేరా
మహిళలని కూడా చూడలేదు..
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి ఇంటిపై, కార్యాలయంపై వేలాదిగా వచ్చిన టీడీపీ మూకలు పక్కా వ్యూహంతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, మహిళలపై కూడా వారు దాడి చేశారు. దీంతో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. – లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)
అంబటి ఇంటిపై , కార్యాలయంపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నా. టీడీపీ గూండాలు మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడి చేయడంతో కింద పడిపోయాం. అక్కడే ఉన్న తోటి పార్టీ శ్రేణుల సహాయంతో వారి బారి నుంచి బయట పడ్డాం. ఇంతటి రాక్షసంగా వ్యవహరిస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించడం చాలా బాధగా ఉంది.
– భాగ్యలక్ష్మి, త్రివేణి
అంబటి ఇంటి వద్దకు పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాను. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో, ఇనుప రాడ్లతో టీడీపీ గూండాలు అంబటి కార్యాలయంలోకి చొరబడ్డారు. అడ్డుగా ఉన్న నాపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకుని రాత్రి 11.45 గంటల వరకు అంబటి రాంబాబు కార్యాలయంలో తలదాచుకున్నాను. నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చి గుంటూరు పట్టాభిపురంలో నివాసం ఉంటున్నాను.
– గుంజి శివ, పల్నాడు జిల్లా
అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని నాతోపాటు మా నాన్న, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, మరికొంత మందితో వెళ్లాం. అక్కడ ఉన్న టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నాపై చేతులతో, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు జీజీహెచ్‌కు తరలించారు.
– పూనూరి చంద్ర ప్రకాష్
పచ్చ మూకల విధ్వంసం
పచ్చ మూకల విధ్వంసం
పచ్చ మూకల విధ్వంసం


