నృసింహుని తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

నృసింహుని తెప్పోత్సవం

Feb 2 2026 7:28 AM | Updated on Feb 2 2026 7:28 AM

నృసిం

నృసింహుని తెప్పోత్సవం

కనుల పండువగా
పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకీలాద్రి వేదపండితులు

డేపల్లి రూరల్‌ : ప్రసిద్ధి గాంచిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున లక్ష్మీ నరసింహస్వామి వారిని సీతానగరంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి యున్న కనకదుర్గ ఆలయం నుంచి నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నృసింహస్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రకాశం బ్యారేజ్‌ ఎగువ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన పంటు వాహనంలో స్వామివారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక భద్రతా చర్యల మధ్య ఇ.వో. సునీల్‌కుమార్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నృసింహుని తెప్పోత్సవం 1
1/1

నృసింహుని తెప్పోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement