పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్
మభ్యపెట్టేలా హామీలు
రైతులను మభ్యపెట్టేందుకు కొమ్మమూరు కాలువలో నీటిని వాడుకున్నందుకు ప్రతిగా సమీపంలోని నల్లమడ డ్రైన్ నుంచి అంతే మొత్తంలో మురుగునీటిని రూ.12 కోట్లతో నిర్మించే మరో లిఫ్ట్ ద్వారా కొమ్మమూరులోకి ఎత్తిపోస్తామని చెబుతోంది. వాస్తవానికి నల్లమడ నీరు మురుగునీరు. ఎగువ ప్రాంతాలైన నరసరావుపేట, చిలుకలూరిపేట పట్టణాలు, ఇతర అన్ని గ్రామాల డ్రైనేజీ నీరు వస్తుంది. పరిశ్రమల వ్యర్థాలు కూడా ఈ డ్రైన్‌లో కలుస్తాయి. సముద్రపు నీరు కూడా ఇందులో చేరి నీరు విషతుల్యంగా మారి పంటలకు, తాగునీటి అవసరాలకు పనికి రావడం లేదు. ఇక్కడ పరిశ్రమలు నిర్మించే పారిశ్రామికవేత్తలకు, ఈ పథకానికి సూత్రధారిగా ఉన్న గుంటూరు సర్కిల్ ఇరిగేషన్ అధికారికి ఈ విషయం తెలియంది కాదు. దిగువ రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. నల్లమడ డ్రైన్ నీరు నిజంగానే బాగుంటే అక్కడే ఎత్తిపోతల పథకం నిర్మించుకోవాలని దిగువ ఆయకట్టు రైతులు సూచిస్తున్నారు. ఏటా నల్లమడలో 40 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉన్నందున రూ. 12 కోట్లతో పథకం పూర్తవుతుందని, ప్రజాధనం దుర్వినియోగం కాదన్నారు. సర్కారు తీరు మారకుంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
● దిగువ రైతుల ప్రయోజనాలకు గండి
● ఫిర్యాదులు అందినా మారని
చంద్రబాబు ప్రభుత్వం
● అంచనాలను సర్కారు
ముందుంచిన అధికారులు
● 6 లక్షల మందికి తాగునీటి
కష్టాలు తలెత్తే అవకాశం
కొమ్మమూరు కాలువపై గుంటూరు జిల్లా చినకాకుమాను వద్ద రూ. 22.88 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ పథకం రైతుల అవసరాల కోసం కాకుండా అక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు నీటిని తరలించేందుకేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నట్లు అధికారవర్గాల నుంచే సమాచారం వస్తోంది.


