ఏఎన్‌యూ(పెదకాకాని): అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో గుంటూరు జిల్లా అస్మిత అథ్లెటిక్స్ లీగ్ అండర్ 14, అండర్ 16 బాలికల విభాగంలో ఎంపికలు జరుగుతాయని సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా జరిగే పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం రూ. 8,93,575 ఆదాయం వచ్చినట్లు డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కానుకలు చెల్లించుకున్నారు. వివిధ సేవా టికెట్ల రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను డీసీ వివరించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 4,79,552, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,85,725, నిత్యాన్నదాన పథకంలో రూ. 1,04,456, శాశ్వత అన్నదానం ద్వారా రూ. 50,812, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 37,040, స్వామివారి దర్శనం ద్వారా రూ. 34,850 కలిపి మొత్తం ఆదాయం రూ. 8,93,552 వచ్చినట్లు ఆయన చెప్పారు.
బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్‌కు అదనపు బాధ్యతలు


