
శారీరక దారుఢ్యానికి సైక్లింగ్ దోహదం
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
బాపట్ల టౌన్: శారీరక దారుఢ్యానికి సైక్లింగ్ దోహదపడుతుందని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండే ఆన్ సైకిల్ ర్యాలీ’ని ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ సైక్లింగ్‌తో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. పోలీస్ ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకుందన్నారు. అలాంటి పనిలో సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయన్నారు. సమూహాలుగా సైక్లింగ్ చేయటం వలన సంబంధాలు మెరుగవుతాయన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఆదివారం ఈ తరహా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఏఆర్ డీఎస్పీ పి.విజయ సారథి, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, రిజర్వ్ సీఐ శ్రీకాంత్, ఎస్‌బీ సీఐ నారాయణ, బాపట్ల టౌన్ సీఐ రాంబాబు, రూరల్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ పాల్గొన్నారు.