
255 ల్యాప్‌టాప్‌లు చోరీ
మేదరమెట్ల: దాబా వద్ద నిలిపి ఉన్న కంటైనర్ నుంచి ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు మేదరమెట్ల పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి చైన్నెకు ల్యాప్‌టాప్‌ల లోడుతో వెళుతున్న కంటైనర్‌ను శనివారం మేదరమెట్ల కొండ సమీపంలోని ఓ దాబా వద్ద నిలిపారు. కంటైనర్ డ్రైవర్, క్లీనర్ అక్కడ నుంచి విశ్రాంతి కోసం వెళ్లిపోయిన వెంటనే.. దొంగలు కంటైనర్‌ను పగుల గొట్టి దానిలోని హెచ్‌పీ కంపెనీకి చెందిన 255 ల్యాప్‌టాప్‌లు, ఒక మానిటర్, ఒక టోనర్‌ను దొంగిలించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం డ్రైవరు, క్లీనరు వచ్చి చూడగా విషయం తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీరాల డీఎస్పీ మొయిన్ స్థానికుల నుంచి వివరాలను సేకరించారు.