పచ్చ నేతల కర్ర పెత్తనం | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల కర్ర పెత్తనం

Aug 18 2025 6:01 AM | Updated on Aug 18 2025 6:31 AM

సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025 పచ్చ నేతల కర్ర పెత్తనం గ్రామాల్లో రెచ్చిపోతున్నారు చీరాల టౌన్‌: చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. మద్యం నుంచి ఇసుక వరకు కాసులు పిండుకుంటున్న నేతలు తాజాగా రేషన్‌ డీలర్లపై దందా చూపిస్తున్నారు. ‘ప్రభుత్వం మాది.. ఇన్నాళ్లు రేషన్‌ డీలర్‌ షిప్‌ ద్వారా బాగా సంపాదించారు.. ఇక మీ ఆటలు సాగవు.. దుకాణాలు మా వారికే చెందాలి.. లేదంటే మాకు కప్పం కట్టాల్సిందే’ అంటూ బెదిరిస్తున్నారు. అధికారులతో కేసులు పెట్టించి షాపులను ‘మా వారికి అప్పగిస్తాం. ఇక మీ ఇష్టం’ అంటూ చెలరేగిపోతున్నారు. చీరాల నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల రూరల్‌ మండలంలో 99 రేషన్‌ దుకాణాలు, వేటపాలెం మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో 47 రేషన్‌ దుకాణాలు కలిపి 146 ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 40 వరకు బలవంతపు రాజీనామాలు, అధికారుల అండతో 6–ఏ కేసులు నమోదు చేయించారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌ దుకాణాలను నడుపుకుంటున్న వారి నుంచి బలవంతంగా గుంజుకుని టీడీపీ నాయకులకు అప్పగించారు. చీరాల నియోజకవర్గంలో రేషన్‌ దుకాణం నడుపుకోవాలంటే అధికార పార్టీ నాయకుల ఆమోదం తప్పనిసరిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో దుకాణాలను నిర్వహించిన డీలర్లపై ప్రస్తుత కూటమి నాయకులు పగబట్టారు. స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేనిపక్షంలో రూ.1.50 లక్షలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీనిని వ్యతిరేకించే వారిపై దాడులు చేయించి 6–ఏ కేసులు నమోదు చేయిస్తున్నారు. తాత్కాలిక డీలర్‌షిప్‌నకు కూడా టీడీపీ అనుచరుల నుంచి కూడా ఒక్కో దుకాణానికి కొత్తగా రూ.1 లక్ష వసూలు చేస్తున్న పరిస్థితులు చీరాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. చీరాల మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ ఈపురుపాలెంలో ఏడు నెలలుగా పలువురు డీలర్లపై కేసులు నమోదు చేయించి టీడీపీ కార్యకర్తలకు షాపులు కట్టబెట్టారు. ఒక్కో రేషన్‌ దుకాణం నుంచి రూ.1.25 లక్షలు వసూలు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దీన్నే ఆదాయ వనరుగా మార్చుకుని మరికొంత మంది డీలర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్నేళ్లుగా డీలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి చనిపోతే ఆ దుకాణాన్ని అతని భార్య నిర్వహిస్తోంది. గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి, మరో నలుగురు టీడీపీ నాయకులు ఆమెను బెదిరించారు. తమ వారికి దుకాణం ఇవ్వాలని లేదా రూ.1.50 లక్షలు ఇస్తే నిర్వహణ చేసుకోవచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ మహిళా డీలర్‌ స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధిని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. టీడీపీ నాయకులు పెడుతున్న ఇబ్బందులు, డిమాండ్లను ప్రజాప్రతినిధికి విన్నవించుకోగా, ఆయన విచారణ చేయిస్తున్నారు. పట్టణానికి చెందిన పలువురు డీలర్లను బెదిరించినా వారు పట్టించుకోకపోవడంతో అధికారుల అండతో 6ఏ కేసులు నమోదు చేయించారు. షాపుల్ని టీడీపీకి చెందిన వారికి కట్టబెట్టారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు లేకపోవడంతో అధికార టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా మారుతోంది. గ్రామస్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రొటోకాల్‌ లేని వారికి కుర్చీలు వేసి రాచమర్యాదలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి పనిని తమ వారికే చేయాలంటూ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు తోటవారిపాలెంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.

న్యూస్‌రీల్‌

మహాలక్షమ్మచెట్టు వార్షికోత్సవం

ఘనంగా అమ్మవారికి బోనాలు

వైభవంగా గంగానమ్మ జాతర

బాపట్ల
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025

నియోజకవర్గంలో 146 దుకాణాలు

డీలర్లపై పగ

ఉదాహరణలు ఎన్నో..

మాకే ప్రొటోకాల్‌ ఇవ్వాలి

7

గ్రామాల్లో యథేచ్ఛగా దందా

రేషన్‌ డీలర్లకు బెదిరింపులు

అధికారులతో కేసులు నమోదు

నియోజకవర్గంలో

40 షాపుల పైగా 6– ఏ కేసులు

ఒక్కో దుకాణదారుడు రూ.1.50

లక్షలు ఇవ్వాలంటూ హుకుం

పంచాయతీ కార్యాలయాల్లో తిష్ట

అధికారులకు ఆదేశాలు జారీ

నరసరావుపేట: స్థానిక కోటబజార్‌లో గల మహాలక్ష్మమ్మచెట్టు వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జలబిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.

శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామంలో పోలేరమ్మకు ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళలు

బోనాలను ఊరేగింపుగా తెచ్చారు.

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి మండలం ఆత్మకూరులో గంగానమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

పచ్చ నేతల కర్ర పెత్తనం 
1
1/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

పచ్చ నేతల కర్ర పెత్తనం 
2
2/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

పచ్చ నేతల కర్ర పెత్తనం 
3
3/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

పచ్చ నేతల కర్ర పెత్తనం 
4
4/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

పచ్చ నేతల కర్ర పెత్తనం 
5
5/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

పచ్చ నేతల కర్ర పెత్తనం 
6
6/6

పచ్చ నేతల కర్ర పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement