
ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వంశ
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లిథమ్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఈ.వంశీకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి జిల్లా ముఖ్య శిక్షణ అధికారి పి. నర్సింహారెడ్డి పర్యవేక్షణ అధికారిగా క్రీడా కోడ్– 2011 అనుసరించి ఎన్నికల నిర్వహించడానికి నిర్ణ యించారు. సమావేశానికి సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.కృష్ణకిశోర్‌రెడ్డి, పి.శివపార్వతి వ్యవహరించారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి. రమ ణ, రాష్ట్ర ఎగ్జిక్యూ టివ్ మెంబర్ బి.లక్ష్మీప్రసన్న పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా న్యాయవాది ఎస్.వి. రమణారెడ్డి వ్యవహరించారు.ఉమ్మడిగుంటూ రు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా ఈ. వంశీకృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సంతోష్ ప్రభుకుమార్, కార్యదర్శిగా పి. సామంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నర్రా శ్రీనివాస్, కోశాధికారిగా ఏ. జనార్దన్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వి.శబరినాథ్, పి. శివపార్వతి, బి. యామిని, వై. రంజాన్‌బీలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు.