
తుంగభద్ర డ్రెయిన్‌లో కొట్టుకుపోయిన యువకుడు
చుండూరు( వేమూరు): తుంగభద్ర డ్రెయిన్‌లో యువకుడు కొట్టుకుపోయిన ఘటన ఆదివారం ఉదయం మండలంలోని దుండిపాలెంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..చుండూరు మండలంలోని దుండిపాలెం గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రశాంత రాజు (20) ఉదయం కాళ్లు శుభ్రం చేసేందుకు తుంగభద్ర డ్రెయిన్ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో జారి మునిగి పోయాడు. రేపల్లె ఆర్డీవో, చుండూరు మండలం తహసీల్దారు సంఘటన స్థలం వద్దకు వచ్చారు. వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించినా, ప్రశాంత రాజు ఆచూకీ దొరకలేదు. సోమవారం కూడా వెదకడం ప్రారంభిస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.