జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రేమయ్య ఎంపిక
ఇంకొల్లు(చినగంజాం) జాతీయ స్థాయిలో నిర్వహించే టీ 20 క్రికెట్ పోటీలకు మండలంలోని నాగండ్ల గ్రామానికి చెందిన బూరగ ప్రేమయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రేమయ్యకు ఆల్ ఇండియా క్రికెట్ డవలప్‌మెంట్ ట్రస్టు నుంచి ఉత్తర్వులు అందాయి. జాతీయ జట్టులో భారతదేశం తరపున క్రికెట్ జట్టులో ప్రేమయ్య బ్యాట్స్‌మన్ ఎంపిక కాగా మే నెల 26 నుంచి 31 వరకు నేపాల్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనున్నట్లు ప్రేమయ్య తెలిపారు. ప్రేమయ్య ప్రస్తుతం నరసరావు పేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నందు డిగ్రీ చదువుతున్నాడు,


