బాపట్ల: రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆర్.రాజానాయక్ గురువారం స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.
సాగర్ డ్యాంను సందర్శించిన సీఈ
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు మెయిన్ డ్యాం ఎడమ వైపున ఎర్త్ డ్యాంపై ఎండిపొయిన కార్పెట్ గ్రాస్‌కు బుధవారం సాయంత్రం నిప్పంటుకుని పూర్తిగా తగలబడింది. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం నల్లగొండ జిల్లా చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, సాగర్ డ్యాం సర్కిల్ ఈఈ శ్రీధర్‌రావు, ఈఈ మల్లికార్జునరావు, ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని, తిరిగి లైన్లు కలిపితే ఏమేరకు నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. కేబుల్స్ కాలిపోయినా, సీసీ కెమెరాలు బాగానే ఉన్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో జరిగిన నష్టాన్ని త్వరలో తేలుస్తామని, తిరిగి కేబుల్స్‌ను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఈసారి అగ్ని ప్రమాదాలు జరిగినా నష్టం జరగకుండా జీఏ పైపుల నుంచి హెచ్‌డీ పైపులు వేసి, అందులో నుంచి కేబుల్స్ వచ్చేలా చూస్తామని ఆయన వివరించారు.
ఆర్ అండ్ బీ ఈఈగా రాజానాయక్