ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె..
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2025 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 40 ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets.a psche.ap.gov.in సైట్‌కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్‌స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు.
ఏపీ ఈఏపీసెట్–2025 షెడ్యూల్ విడుదల మే 21 నుంచి 27 వరకు ఏపీ ఈఏపీసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ మే 19,20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40ఇంజినీరింగ్ కళాశాలల్లో 20వేల సీట్లు