అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Mar 16 2025 1:59 AM | Updated on Mar 16 2025 1:56 AM

చీరాల రూరల్‌: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మత్తుమందుచ్చి వారివద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకునే అంతర్రాష్ట్ర దొంగను చీరాల రైల్వే పోలీసులు అరెస్టుచేసి కటకటాల వెనక్కి నెట్టారు. శనివారం జీఆర్పీ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సీహెచ్‌.కొండయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో నెల్లూరు నుంచి చీరాలకు రైలులో వస్తున్న ఓ మహిళకు మత్తుమందుచ్చి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దొంగలు అపహరించారు. ఆ సంఘటనపై గుంతకల్లు రైల్వే ఎస్పీ రాహుల్‌ మీనా, నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్‌ సూచనల మేరకు ఒంగోలు సీఐ ఎస్‌కె.మౌలా షరీఫ్‌ ఆధ్వర్యంలో కేసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. కేసులోని మొదటి నిందితుడిగా ఉన్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన కాజల్‌ వర్మను ఈఏడాది జనవరిలో అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసులో రెండో నిందితునిగా ఉన్న హర్యానా రాష్ట్రానికి చెందిన విజేందర్‌కుమార్‌ను ఈనెల 12న హర్యానా రాష్ట్రంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసులోని నిందితుడిని ఆయా రాష్ట్రానికి చెందిన కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా నెల్లూరులోని రైల్వే కోర్టుకు తరలించి రిమాండ్‌ నిమిత్తం జైలుకు పంపనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదులోకి తీసుకున్న చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్‌.కొండయ్య, పోలీసులు ఎస్‌కె.ఖాదర్‌బాషా, డి.శ్రీనురాజు, పి.లక్ష్మీనారాయణలను నెల్లూరు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు జి.మురళీధఽర్‌, ఒంగోలు సీఐ ఎస్‌కె.మౌలా షరిఫ్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement