
సీఓపీడీ బాధితులకు ప్రతిరోజూ గుంటూరులోని ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నాం. ప్రతిరోజూ అవుట్ పేషెంట్ విభాగంలో పది మంది బాధితులు వైద్య సేవ లు పొందుతున్నారు. బాధి తులకు అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందజేస్తున్నారు. అడ్మిషన్ అవసరమైన వారిని వార్డులో చేర్చుకుని వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో 24 గంటలూ నిపుణులు అందుబాటులో ఉంటున్నారు.
– డాక్టర్ ఎన్.భాస్కరరావు, పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్
●