కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పొట్టిశ్రీరాములు కాలనీలో ఉద్రిక్తతకు తెరపడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని స్వచ్ఛందంగా బుధవారం అక్కడ నుంచి తాత్కాలికంగా తీసివేశారు. మంగళవారం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కూడా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి అడ్డుగా ఉన్న విగ్రహాలను టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు తాత్కాలికంగా తొలగించి సమస్యకు ముగింపు పలికారు. కల్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుందని కల్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యాక ఇబ్బంది లేకుండా మళ్లీ విగ్రహాలను పునప్రతిష్ట చేసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


