గ్యాస్‌ కొరత లేదు... | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత లేదు...

Mar 18 2026 9:40 AM | Updated on Mar 18 2026 9:40 AM

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో గృహ అవసర గ్యాస్‌ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్‌ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎల్‌.పి.జీ ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్‌ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్‌ పంపిణీ చేయాలని గోడౌన్‌ ఇన్‌చార్జిని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్‌ బుక్‌ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్‌ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్‌ బుకింగ్‌లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్‌ నుంచి లోడ్‌ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్‌ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్‌ ఇన్‌చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement