రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మూకిరి దినేష్‌  - Sakshi

ఒకరికి తీవ్రగాయాలు

నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన నరసరావుపేటరోడ్డులో మండలంలోని దేచవరం మిద్దె సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలాఉన్నాయి. మండలంలోని చల్లగుండ్ల గ్రామానికి చెందిన మూకిరి దినేష్‌ (19) అతను తనకు వరుసకు చిన్నమ్మ అయిన మేడా మేఘనతో కలసి ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు బయలుదేరారు. మార్గంమధ్యలో దేచవరం మిద్దె వద్ద నరసరావుపేట నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో దినేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మేఘనకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు 108 సహాయంతో తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మేఘనకు నవోదయ ఎంట్రన్స్‌ పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతుదేహం వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ తెలిపారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top