
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న రెవెన్యూ అధికారి వెంకటరమణ
బాపట్ల అర్బన్: జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో స్పందన కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ భూముల సర్వేకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. సర్వే అధికారులు గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దాసరి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ హరి నారాయణ, గ్రామీణ నీటి సరఫరాల శాఖ ఎస్‌ఈ విద్యాసాగర్, పరిశ్రమల శాఖ జి.ఎం.మదన్‌మోహన్‌శెట్టి, వ్యవసాయ శాఖ జేడీ అబ్దుల్ సత్తార్, మత్స్య శాఖ జేడీ సురేష్, పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, పౌర సరఫరాల శాఖ అధికారి విల్లేమ్స్, డీఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.