
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న చైర్మన్ అప్పారావు, తదితరులు
ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అప్పారావు
బాపట్ల అర్బన్: బాలల హక్కులను రక్షించాల్సిన బాధ్యత అందరిదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అప్పారావు అన్నారు. సోమవారం బాపట్లలోని చైతన్య స్కూల్, బాల సదనం, కొండభొట్లపాలెంలోని జెడ్పీ స్కూల్‌ను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో వసతులు లేకపోవడంతో యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలల హక్కులకు భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. అనంతరం బాపట్లలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడారు. బాలల హక్కుల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటరమణ, డీఈవో రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.