
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
చీరాల: విద్యార్థుల్లో చిన్నతనం నుంచే శాసీ్త్రయ భావాలను పెంపొందించాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నా రు. పద్మశాలీయ కల్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో సైన్స్ విషయాలను కాకుండా సూడో సైన్స్ విషయాలను ప్రచారం చేస్తు న్నారని విమర్శించారు. విద్యా ర్థులు సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం ద్వారా భావి విద్యార్థులు జీవ పరిణామ క్రమం తెలియకుండా చేశారని పేర్కొన్నారు. సృష్టివాదాన్ని నమ్మే విధంగా తయారు చేయాలనుకోవడం ప్రస్తుత పాలకుల సంకల్పమని వివరించారు. విద్యాలయాల్లో హేతు విరుద్ధమైన వాస్తు, జ్యోతిష్యం, భూతవైద్యం లాంటి వాటిని శాస్త్రాలుగా నమ్మించి అధికారికంగా బోధిస్తూ వాటిల్లో మాస్టర్ డిగ్రీ ప్రదానం చేయడం ద్వారా ప్రభుత్వమే అశాసీ్త్రయ ధోరణిని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మానవుడి నిత్య జీవనంలో సైన్స్ చాలా అవసరమని విద్యా విధానంలో మార్పులు రావాలని సూచించారు. ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ జాతీయ సహాయ కార్యదర్శి వీజీ గోపినాథన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చిల్డ్రన్స్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఆధునిక విజ్ఞానాన్ని పెంచుతున్నామని చెప్పారు. చెకుముఖి ద్వారా విద్యార్థులు సైన్స్ పరంగా విజ్ఞానాన్ని పొందుతున్నారని తెలిపారు. ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ మానవశ్రమ ద్వారా వచ్చిన శక్తే సైన్స్ అన్నారు. నేడు మాన విజ్ఞాన శాస్త్రంపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేవీవీ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, జేవీవీ నేత రాజశేఖర్ రాహూల్, గోపాలం శివన్నారాయణ, బోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్, మురళీధర్, కుర్రా రామారావు పాల్గొన్నారు.