Weekly Horoscope In Telugu 29-05-2022 To 04-06-2022 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope: వారంలో ఈ రాశి వారికి ధనలాభం

May 29 2022 6:19 AM | Updated on Jun 3 2022 1:46 PM

Weekly Horoscope In Telugu 29-05-2022 To 04-06-2022 - Sakshi

వారఫలాలు..

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనం లభిస్తుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు, అమ్మకాల్లో పురోగతి కనిపిస్తుంది. కొన్ని పాత  సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.  ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఓర్పుతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుతారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అవసరాలు తీరతాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.  కళారంగం వారికి శుభదాయకమైన కాలం.  వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి. కొన్ని రహస్య విషయాలు తెలుసుకుంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి.  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దూరప్రాంతాల నుంచి ముఖ్య  సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు అనూహ్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు.  తెలుపు. గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి కాగలవు. విద్యార్థులు కొన్ని పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు.  ఆస్తి విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం.  వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. శాస్త్రవేత్తలు పరిశోధనలలో విజయం సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అవసరాలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారి యత్నాలు సఫలం. వీరికి సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో భూవివాదాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో శుభకార్యాలు జరుపుతారు. ఆప్తుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగుతాయి. కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మీ  సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఊహించని ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. అందరి ఆదరణ, ప్రేమను పొందుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు కొన్ని లభించవచ్చు. వారం చివరిలో  రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. మానసిక ఆందోళన. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరిచయాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. జీవితాశయ సాధనలో విజయం. మీపై విమర్శలు చేసిన వారే ప్రశంసిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.  గృహ నిర్మాణయత్నాలు వేగవంతంగా చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది.  ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు కొంటారు. ఆలోచనలు మరింత  కలసివస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. క్లిష్ట సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత స్థితిని పొందే సూచనలు. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. నీలం, రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో  చిక్కులు తొలగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.  నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు ఆశించినంతగా  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది.  వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో  రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. కొన్ని వ్యవహారాలలో శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. ఇంటి నిర్మాణంలో ఆటంకాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురై సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement