Weekly Horoscope: ఈ రాశివారికి వారం మధ్యలో అనుకోని ధనవ్యయం.. కుటుంబంలో సమస్యలు

Weekly Horoscope In Telugu 23-01-2022 to 29-01-2022 - Sakshi

మేషం
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాల  పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు.తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు.  నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు తీరతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. గులాబీ, లేత పసుపు.తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి

మిథునం
కొన్ని ముఖ్య పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని కళానైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. బాధ్యతలు పెరుగుతాయి. నీలం, సిమెంట్‌. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి

కర్కాటకం
అనుకున్న పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో  పరపతి పెరుగుతుంది. గృహం, వాహనాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి అవసరాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో కలహాలు. నీలం, నలుపు..పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివపంచాక్షరి పఠించండి.

సింహం
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు  కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో  శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. లేత పసుపు, ఎరుపు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. సన్నిహితులతో తగాదాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. శుభకార్యాలపై మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన రీతిలో పదవులు దక్కవచ్చు. వారం చివరిలో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, సిమెంట్‌.ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల
ముఖ్య పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. పెట్టుబడులు అనూహ్యంగా లభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. నలుపు, లేత ఆకుపచ్చ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికం
ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో∙నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి.  వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు అనుకున్న మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు..పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.

ధనుస్సు...
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు శుభవార్తలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటì  విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. పైస్థాయి ప్రశంసలు సైతం అందుతాయి. రాజకీయవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. అనారోగ్యం. నేరేడు, బిస్కెట్‌.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం
పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒక ముఖ్య సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం.ఉత్తరదిశ ప్రయాణాలు  అనుకూలం. శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.

కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అంది ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. కళారంగం వారికి  ఊహించని అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. .లేత గులాబీ, పసుపు. తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు అనుకోకుండా దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ నిర్ణయాల కోసం బంధువులు ఎదురుచూస్తుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివచ్చే సూచనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలమవుతాయి.  ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో విభేదాలు. శ్రమ తప్పకపోవచ్చు. ఎరుపు, లేత గులాబీ..దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top