వారఫలాలు: 18 డిసెంబర్‌ నుంచి  24 డిసెంబర్‌ 2022 వరకు

Weekly Horoscope Telugu 18-12-2022 T0 24-12-2022 - Sakshi

మేషం
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించాలన్న కోరిక నెరవేరే సమయం. ఆస్తులు కొనుగోలుపై ఒక అంగీకారానికి వస్తారు. వ్యాపారాలు మరింత వేగవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. వారం చివరిలో కార్యభారం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
(కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. విద్యార్థులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభపడతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక ఆందోళన. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని ఆరాధించండి.

మిథునం
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆస్తులు కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విధానాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఎటువంటి పని చేపట్టినా దిగ్విజయంగా సాగిపోతుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు.  వ్యాపారాల విస్తరణపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి అప్పుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. మీ శ్రమ కొన్ని విషయాలలో వృథా కాగల అవకాశం. ఇంటి నిర్మాణాలు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో కొంత అందోళన చెందుతారు. అనుకున్న పెట్టుబడులు సమకూరక సతమతమవుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. తెలుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. వ్యవహారాలలో విజయం. నగలు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. భూవివాదాలు, కోర్టు కేసులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

తుల
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కుటుంబసభ్యులు మీ ప్రతిభకు సంతోషపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు మరింత దక్కవచ్చు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. ఇంటి కొనుగోలు ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సంతోషకరంగా గడుపుతారు. రాజకీయవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వివాహాది శుభకార్యాలు నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో తగిన మార్పులు జరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. తెలుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈరాశి వారికి స్వగృహ కల నెరవేరే సమయం. చిన్ననాటి విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఒక సంఘటన మీలో కొంత మార్పునకు దోహదపడుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము చేతికంది అవసరాలు తీరతాయి. మీ ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరతాయి. కొన్ని శుభకార్యాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. మీ కృషి , పట్టుదలతో ఒక వివాదం నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలు సజావుగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆస్తులు కొనుగోలులో క్రియాశీల పాత్ర పోషిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. తెలుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. కొన్ని శుభకార్యాలు సైతం నిర్వహిస్తారు. కొన్ని చికాకులు తొలగి ఊరట  లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు రావచ్చు. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top