మేషం...
కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మరిన్ని పెట్టుబడులు సమకూరవచ్చు. ఉద్యోగులు కొత్త హోదాలు పొందుతారు. రాజకీయవేత్తలకు పదవీయోగం. కళాకారులు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. పసుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృషభం.....
రావలసిన డబ్బు అవసరాలకు సమకూరుతుంది. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారి సహాయం అందుతుంది. వ్యాపారస్తులకు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులు చికాకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు . క్రీడాకారులకు సమర్థతను నిరూపించుకుంటారు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఖర్చులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మిథునం...
ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కార్యక్రమాలను సజావుగా సాగుతాయి. «ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూరి ఊరట చెందుతారు. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.
కర్కాటకం....
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమయానుసారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. రాబడి మీ అవసరాలకు తగినంతగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాలు నెరవేరతాయి. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు సంతప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళాకారులకు నూతనోత్సాహం. వైద్యులు మరింత పేరు గడిస్తారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిళ్లు. పసుపు, ఎరుపు రంగులు.గణేశాష్టకం పఠించండి.
సింహం....
ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది. రుణాలు చేయాల్సిన పరిస్థితి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు కష్టసాధ్యం. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. ఆస్తి వివాదాలు సవాలుగా మారతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తల ఆశలు ఫలించవు. క్రీడాకారులకు అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.
కన్య....
మీ శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలను ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు రాదు. కొన్ని ఉత్సవాలలో పాల్గొంటారు. అందరిలోనూ తగిన గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు లాభాలు దక్కి ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగవర్గాలకు క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. క్రీడాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో బంధువుల నుంచి ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుధ్యానం చేయండి.
తుల....
పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ఊహలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎటువంటి కార్యక్రమాన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు దక్కుతాయి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. బంగారు, తెలుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం...
కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులు విధుల్లో ప్రశాంతంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తల నిరీక్షణ ఫలిస్తుంది. వైద్యులకు కొన్ని పురస్కారాలు అందవచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. కుటుంబంలో అదనపు బాధ్యతలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఈశ్వరారధన మంచిది.
ధనుస్సు...
కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. «ఉత్సవాలకు హాజరవుతారు. వ్యాపారులకు ఆశించినదానికి మించి లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవరోధాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం...
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశయాలు నెరవేరతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనుకూలస్థితి. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం....
నూతన వ్యక్తుల పరిచయాలు. సమాజంలో ఆదరణ లభిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారులు లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారుల యత్నాలు సానుకూలమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. బంగారు, నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
మీనం...
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు, కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో మరింత సానుకూలత. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శుభవార్తలు. క్రీడాకారులకు విశేష ఆదరణ. వారం మధ్యలో వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


