ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope In Telugu From 09-11-2025 To 15-11-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Nov 9 2025 1:13 AM | Updated on Nov 9 2025 1:13 AM

Weekly Horoscope In Telugu From 09-11-2025 To 15-11-2025

మేషం...
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు బంధువులను మెప్పిస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఇతరులకు సైతం సాయం అందించేందుకు ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు కొంత నెరవేరతాయి. వారం మధ్యలో  వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం...
కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి.  ఆర్థిక లావాదేవీలు కొంత గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కొన్ని పనులను హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకోని మార్పులు ఉండవచ్చు.  పారిశ్రామికవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మిథునం....
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. కోర్టు విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వాహనయోగం. వ్యాపారాలలో తగినంత  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో  అనారోగ్యం. బంధువులతో తగాదాలు.  నేరేడు, నీలం రంగులు.  దుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో  మీ సత్తా చాటుకుని విధుల్లో ముందుకు సాగుతారు.  కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కొద్దిపాటి వివాదాలు. కుటుంబంలో సమస్యలు.  స్వల్ప అనారోగ్యం.  గులాబీ, పసుపు రంగులు.  శివపంచాక్షరి పఠించండి.

సింహం....
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో మరింత అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుమణుగుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి.  గులాబీ, నీలం రంగులు.  వినాయకునికి అర్చన చేయండి.

కన్య...
ఆర్థిక పరిస్థితి ఆశాజనంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం చివరిలో ధనవ్యయం. కావలసిన వ్యక్తులతో తగాదాలు.  పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.

తుల...
కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగాలలో  కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ అనుభవాలతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, మిత్రుల సహకారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో మరింత సానుకూల వాతావరణం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు...
ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పనుల్లో  మరింత పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు తీరి ఉపశమనం లభిస్తుంది.  భూ, గృహయోగాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది.  వారం మధ్యలో అనారోగ్యం. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం....
మీ అంచనాలు కొన్ని  ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం.  వ్యాపారాలు ఆశించిన స్థాయిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది.  వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం...
మీ సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలు కొంత సానుకూలమవుతాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఊహించని రీతిలో తీరతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. తెలుపు, గులాబీ రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

మీనం...
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని పెండింగ్‌ బాకీలు సైతం వసూలవుతాయి. మీసేవలు విస్తృతమవుతాయి. బంధువర్గం సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతమైన సమాచారం రాగలదు. వ్యాపారవర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు.  ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు. గులాబీ,  పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement