
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.చతుర్దశి ప.3.09 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: భరణి ప.2.10 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.2.00 నుండి 3.32 వరకు, దుర్ముహూర్తం: ప.3.55 నుండి 4.43 వరకు, అమృతఘడియలు: ఉ.9.32 నుండి 11.03 వరకు, కార్తీక పౌర్ణమి; రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు, సూర్యోదయం: 6.14, సూర్యాస్తమయం: 5.20.
మేషం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం: కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కర్కాటకం: ఇంట శుభకార్యాల ప్రస్తావన ఆదాయం సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
సింహం: ముఖ్య పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
కన్య: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
తుల: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
ధనుస్సు: సన్నిహితులతో వివాదాలు. ఆదాయం అంతగా లేక అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం: కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టమే మిగులుతుంది. ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో అకారణంగా వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
కుంభం: పనుల్లో విజయం. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment