ఈ రాశి వారికి ఆసక్తికర సమాచారం అందుతుంది, సకాలంలో పనులు పూర్తి..

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.చతుర్దశి ప.12.24 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం పూర్వాభాద్ర ఉ.10.39 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.8.15 నుండి 9.54 వరకు, దుర్ముహూర్తం ఉ.10.04 నుండి 10.52 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు, అమృతఘడియలు... తె.5.54 నుండి 7.30 వరకు (తెల్లవారితే శుక్రవారం).
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
రాశిఫలాలు..
మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం: వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. ధనలాభం. పలుకుబడి పెరుగుతుంది. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మిథునం: యత్నకార్యసిద్ధి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపరుస్తాయి.
సింహం: వివాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు దగ్గరవుతారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.
తుల: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలించక ఇబ్బందిపడతారు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
ధనుస్సు: ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా సాగుతాయి.
మకరం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
మీనం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.