Horoscope Today: August 29, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి దూరప్రాంతాల నుండి శుభవార్తలు.. వ్యవహారాలలో విజయం

Published Mon, Aug 29 2022 6:38 AM | Last Updated on Mon, Aug 29 2022 8:53 AM

Today Horoscope 29-08-2022 - Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.విదియ ప.2.32 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తర రా.11.21 వరకు, తదుపరి హస్త వర్జ్యం: ఉ.5.52 నుండి 7.32 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు అమృతఘడియలు: ప.3.46 నుండి 5.25 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు సమకూర్చుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల కలయిక. విందువినోదాలు. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. బంధువుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: మిత్రులతో కలహాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కుంభం: మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు సఫలం. వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాలకు తగినట్లుగా ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement