
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి పౌర్ణమి రా.12.35 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం పూర్వాషాఢ రా.12.30 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం ప.11.02 నుండి 12.33 వరకు, దుర్ముహూర్తం ప.11.39 నుండి 12.30 వరకు, అమృతఘడియలు...రా.7.56 నుండి 9.25 వరకు, వ్యాస(గురు)పౌర్ణమి.
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: పనులు మరింత నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం సహకరించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
వృషభం: మిత్రులతో లేనిపోని తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
కర్కాటకం: కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖుల నుండి కీలక సందేశం. దైవదర్శనాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విందువినోదాలు.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. బంధువులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కన్య: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.
వృశ్చికం: రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కుంభం: సన్నిహితుల నుండి ధనలబ్ధి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
మీనం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. దైవదర్శనాలు.
Comments
Please login to add a commentAdd a comment