రాశిఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక బలం చేకూరుతుంది.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

today horoscope 06 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం : 6.35; సూర్యాస్తమయం:  5.53;

తిథి: బ.పాడ్యమి రా.1.17 వరకు తదుపరి విదియ,
నక్షత్రం: ఆశ్లేష ప.2.30 వరకు, తదుపరి మఖ,

వర్జ్యం: రా.3.43 నుండి 5.28 వరకు,
దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.38 వరకు,
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు;
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

అమృతఘడియలు: ప.2.14 నుండి 3.43 వరకు;

మేషం: కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: ఆత్మీయులతో కలహాలు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: సోదరులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

మకరం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. ఆత్మీయుల నుండి పిలుపు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.

కుంభం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మీనం: పనులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top