
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: అమావాస్య ఉ.7.17 వరకు, తదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తె.5.30 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం: శతభిషం ప.3.05 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.9.10 నుండి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.43 నుండి 9.31 వరకు, తదుపరి ప.12.38 నుండి 1.26 వరకు, అమృత ఘడియలు: ఉ.8.10 నుండి 9.42 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01.
మేషం.. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
వృషభం... దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. ధనలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక గుర్తింపు.
మిథునం... ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం
కర్కాటకం.... మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
సింహం.... రుణభారాల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. సన్నిహితుల నుంచి సాయం. ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కన్య.... దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.
తుల... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారాలలో చాకచక్యం ప్రదర్శించడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పకపోవచ్చు.
వృశ్చికం.... చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దూరర్రపయాణాలు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
ధనుస్సు... పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం.... సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.
కుంభం... ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
మీనం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment