ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. భూములు, వాహనాలు కొంటారు | Today Telugu Horoscope On March 27th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. భూములు, వాహనాలు కొంటారు

Mar 27 2025 5:15 AM | Updated on Mar 27 2025 8:54 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-03-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.త్రయోదశి  రా.9.08 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శతభిషం రా.11.00 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.6.51 నుండి 8.23 వరకు, తదుపరి తె.5.55 నుండి 6.33 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.54 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: ప.3.56 నుండి 5.31 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 6.05. 

మేషం... ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం.... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.

మిథునం.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కర్కాటకం... రాబడికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

సింహం... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

కన్య.... కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల.... ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం... కుటుంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

ధనుస్సు.... నూతన వ్యక్తుల పరిచయాలు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులకు శ్రీకారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మకరం.... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం... నూతన ఒప్పందాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి.  విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మీనం... శ్రమ మరింత పెరుగుతుంది. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement