గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.ద్వాదశి రా.8.18 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: జ్యేష్ఠ తె.6.18 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.9.53 నుండి 11.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.19 నుండి 11.03 వరకు, తదుపరి ప.2.44 నుండి 3.28 వరకు, అమృత ఘడియలు: రా.8.27 నుండి 10.14 వరకు, మకర సంక్రాతి, ఉత్తరాయణం ప్రారంభం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.41
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం.... పనుల్లో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ తప్పదు. దేవాలయ దర్శనాలు.
వృషభం... కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం.... కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకు పదవీయోగం. వాహనసౌఖ్యం.
కర్కాటకం.... రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన ప్రగతి కనిపించదు. దేవాలయాలు సందర్శిస్తారు.
సింహం... మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.
కన్య.... ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల..... కుటుంబంలో చికాకులు. వథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. . వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులు సన్మానాలు జరుగుతాయి.
ధనుస్సు... కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. స్నేహితులే శత్రువులుగా మారతారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు యత్నాలు ఫలించవు.
మకరం... చిన్ననాటిమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు.
కుంభం... అంచనాలు నిజం చేసుకుంటారు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అప్పులుచేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపార,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. దేవాలయాలు సందర్శిస్తారు.


