గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.ఏకాదశి సా.6.06 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: అనూరాధ రా.3.40 వరకు, తదుపరి జ్యేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.11.47 నుండి 12.31 వరకు, అమృత ఘడియలు: సా.4.06 నుండి 5.54 వరకు.భోగి, మకర సంక్రమణం, మతత్రయ ఏకాదశి
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.40
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగుల యత్నాలు ఫలించవు. దేవాలయదర్శనాలు.
వృషభం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తిలాభాలు. వ్యాపారులకు పురోగతి. ఉద్యోగులు ప్రమోషన్లు సాధిస్తారు..
మిథునం... ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలబ్ధి. వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కర్కాటకం... సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం.
సింహం... కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు.
కన్య.... ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తిలాభం. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వాహనయోగం.
తుల.... కుటుంబంలో చికాకులు. పనుల్లో అవరోధాలు. వృథా ఖర్చులు. స్నేహితులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు నిరాశకు గురిచేస్తాయి. చోరభయం.
వృశ్చికం... పరిచయాలు విస్తరిస్తాయి. అందరిలోనూ గుర్తింపు. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దేవాలయదర్శనాలు.
ధనుస్సు.... మీ యత్నాలకు కుటుంబసభ్యుల నుంచి ఆటంకాలు. అనారోగ్యం. స్నేహితులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం.... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. కాంట్రాక్టర్లకు అనుకూలం.
కుంభం... ఉద్యోగ ప్రయత్నాలుముమ్మరం చేస్తారు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం..... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సోదరులతో తగాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అంచనాలు తప్పుతాయి.


