గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.దశమి ప.3.57 వరకు, తదుపరి ఏకాదశి,నక్షత్రం: విశాఖ రా.1.01 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: తె.5.27 నుండి 7.15 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.46 వరకు,అమృత ఘడియలు: ప.3.21 నుండి 5.07 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
వృషభం... ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. మిత్రుల నుంచి ధనలబ్ధి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.
మిథునం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం... నిర్ణయాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో ఆటంకాలు. మిత్రులు, బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
సింహం..... కొత్త పనులు ప్రారంభం. శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వస్తులాభాలు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కన్య..... చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
తుల.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం..... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
ధనుస్సు....... నూతన వ్యక్తుల పరిచయం. వేడుకల నిర్వహణలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం.... పనులు సకాలంలో పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం.
కుంభం..... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
మీనం.. రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం.


