గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.నవమి ప.2.00 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: స్వాతి రా.10.33 వరకు, తదుపరి విశాఖ,వర్జ్యం: తె.4.44 నుండి 6.30 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.46 నుండి 3.30 వరకు, అమృత ఘడియలు: ప.12.58 నుండి 2.44 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వృషభం..... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.
మిథునం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
కర్కాటకం.... వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
సింహం.... ఆసక్తికర సమాచారం. శుభకార్యాల ప్రస్తావన. ధనలబ్ధి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
కన్య..... వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.
వృశ్చికం..... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
ధనుస్సు... స్థిరాస్తి వృద్ధి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ఆశాజనకం.
మకరం... బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం.... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.
మీనం... సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.


