
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.చతుర్దశి ప.11.24 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.04 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర తె.5.04 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం: ప.3.16 నుండి 4.48 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: రా.12.23 నుండి 1.54 వరకు.
సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.44
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు విఫలం.
వృషభం.... పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు.
మిథునం...... శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు.
సింహం..... రుణాలు చేస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చికాకులు. మానసిక అశాంతి.
కన్య.....వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటాబయటా అనుకూలం.
తుల.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం.
వృశ్చికం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి ఒత్తిడులు. భూవివాదాలు.
ధనుస్సు.... బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు.
మకరం... ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం.
కుంభం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనాలు విషయంలో జాగ్రత్తలు పాటించండి.
మీనం.... కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి.