ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం | Rasi Phalalu: Daily Horoscope On 05-05-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తివృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం

May 5 2025 5:25 AM | Updated on May 5 2025 8:30 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-05-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.అష్టమి ప.11.59 వరకు,తదుపరి నవమి, నక్షత్రం: ఆశ్లేష సా.6.04 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.6.42 నుండి 8.20 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు, అమృతఘడియలు: సా.4.20 నుండి 6.02 వరకు

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం..... పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.

వృషభం.. కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం.  ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం.

మిథునం... దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

కర్కాటకం... కొత్త పనులు చేపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

సింహం.... ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

కన్య.... నూతన విద్యావకాశాలు. మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం.. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వస్తులాభాలు.

తుల.... ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం.

వృశ్చికం... దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

ధనుస్సు... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు  మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు.

మకరం.... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

కుంభం.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూలత. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.

మీనం..... ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement