
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి రా.1.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర ఉ.11.16 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.25 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.11వరకు, తదుపరి ప.12.26 నుండి 1.15 వరకు, అమృత ఘడియలు: రా.12.46 నుండి 2.20 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 6.10.
మేషం... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
వృషభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
మిథునం... బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
సింహం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.
కన్య...... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం..... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం.. వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
మీనం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.