Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు | Today Telugu Horoscope On May 21st, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

May 21 2024 6:26 AM | Updated on May 21 2024 10:04 AM

Rasi Phalalu 21-05-2024 Telugu

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.21 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. 

మేషం: ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: నూతన ఉద్యోగాలు లబిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.

తుల: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

వృశ్చికం: పరిస్థితులు అంతగా కలసిరాదు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

మీనం: కుటుంబంలో ఇబ్బందులు. సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement