ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి

Horoscope Today 22-03-2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: తిథి శు.పాడ్యమి రా.9.54 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.4.57 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.4.35 నుండి 6.10 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: ప.12.22 నుండి 1.54 వరకు, ఉగాది; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 6.06. 

మేషం: పనుల్లో  కొన్ని ఆటంకాలు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు.. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: కార్యజయం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ముఖ్య  నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం: ఉత్సాహంగా పనులు సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు పనిభారం.

సింహం: మిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని  హోదాలు

తుల: నిరుద్యోగులకు శుభవార్తలు. పనులు సమయానికి పూర్తి కాగలవు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

వృశ్చికం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తప్పకపోవచ్చు.

ధనుస్సు: శ్రమ తప్పదు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మకరం: దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త  పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలలో అనుకూలిస్తాయి.  వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top