ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది

daily horoscope today rasi phalalu 3110 2023  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.తదియ రా.10.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: కృత్తిక ఉ.6.01 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.10.03 నుండి 11.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.29 నుండి 11.18 వరకు, రా.2.54 నుండి 4.30 వరకు, అట్లతదియ; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 5.27. 

మేషం.... మిత్రులు శత్రువులుగా మారతారు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం.... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం.... పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం..... నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తిలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. «వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ధనవ్యయం. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

తుల.... సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.

ధనుస్సు... మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలు లాభిస్తాయి. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మకరం... కొత్త  మిత్రుల పరిచయం. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం... ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య పనులలో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మీనం.... పనుల్లో విజయం. ఆప్తులతో ముఖ్య విషయాలపై చర్చలు. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top