ఈ రాశివారి ఆలోచనలు స్థిరంగా ఉండవు

Daily Horoscope In Telugu 16 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.చవితి ఉ.6.26 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఆరుద్ర ఉ.8.11 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం రా.8.54 నుండి 10.36 వరకు, దుర్ముహూర్తం సా.4.36 నుండి  5.27 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  5.32
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త పరిచయాలు. వస్తులాభాలు. ఇంటర్వూ లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

కర్కాటకం: రుణాలు తీరతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

సింహం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బం«ధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా  వేస్తారు. బంధువులతో తగాదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top