Horoscope: ఈ రాశివారి జీవితంలో ఆశ్చర్యకర సంఘటనలు | Daily Horoscope sept 03 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

Horoscope: ఈ రాశివారి జీవితంలో ఆశ్చర్యకర సంఘటనలు

Published Tue, Sep 3 2024 6:22 AM | Last Updated on Tue, Sep 3 2024 9:13 AM

Daily Horoscope sept 03 2024 Telugu Rasi Phalalu Today

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: అమావాస్య ఉ.6.11 వరకు, తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి, నక్షత్రం: పుబ్బ రా.2.49 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.9.18 నుండి 11.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.7.50 నుండి 9.34 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.48, సూర్యాస్తమయం: 6.11. 

మేషం: అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు.మానసిక అశాంతి. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: మిత్రులతో  విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది.పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు.కొత్తగా అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

తుల: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

వృశ్చికం: కొత్త ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. దైవదర్శనాలు.

మకరం: నిరుద్యోగుల కృషి ఫలించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కుంభం: కీలక వ్యవహారాలలో విజయం. నూతన విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మీనం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం..
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement