జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

మదనపల్లె సిటీ : జాతీయ స్థాయి యోగా పోటీలకు మదనపల్లె నవచైతన్యభారతి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు కరస్పాండెంట్‌ గిరిజమ్మ, ప్రిన్సిపాల్‌ మానస పద్మనాభూని, యోగా గురువు అనితలక్ష్మి గురువారం తెలిపారు. గత నెల 29,30 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగిన 52వ ఏపీ యోగసాన స్పోర్ట్స్‌ ఛాంఫియన్‌ షిప్‌ 2026 పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో పాఠశాల నుంచి పది మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 7వ తరగతి విద్యార్థినులు జీ.కీర్తిప్రియ, ఎస్‌.ఆఫీఫా, ఐదో తరగతి చదువుతున్న యాషిక, అనిషాలు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. త్వరలో వీరు రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆంద్రప్రదేశ్‌ తరపున పాల్గొంటారని తెలిపారు.

అదశ్యమైన మహిళ హత్యకు గురైందా?

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మదనపల్లె మండలం కొండమరిపల్లికి చెందిన లక్ష్మీదేవి కొద్దిరోజుల క్రితం అదశ్యమయ్యారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో లక్ష్మిదేవిని ఓ రెస్టారెంట్‌ సమీపంలో హత్య చేశారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో తాలూకా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

రామసముద్రం : మండల కేంద్రంలోని బలిజవీధికి చెందిన చింతల సురేంద్రబాబు అలియాస్‌ బాబు (52) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం భూసానికురపల్లి రహదారిలోని తన వ్యవసాయ భూమి వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల అదుపులో అనుమానితులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement